జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 12 వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.
న్యూఢిల్లీ : జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 12 వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. బుధవారం న్యూఢిల్లీలో రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది.
ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు లెవనేత్తిన ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని వెంకయ్య స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలతో మరో దఫా చర్చిస్తామన్నారు. అవసరమైతే అన్ని పార్టీల నేతలతో వ్యక్తిగతం మాట్లాడతానని చెప్పారు. రాజ్యసభలో 45, లోక్సభలో 25 బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.