‘మోదీపై పోటీని విరమించుకుంటున్నా’

Bhim Army Chief Says He Wont  Fight Against PM Modi In Varanasi - Sakshi

లక్నో : వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసే విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చం‍ద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు. తాను,  అనుచర వర్గమంతా ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘ వారణాసి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా కారణంగా నరేంద్ర మోదీకి ఎటువంటి లాభం చేకూరకూడదని భావించాను. మేమంతా బీజేపీ ఓటమి కోసం కృషి చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికల్లో మోదీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అదే నియోజక వర్గం నుంచే తాను బరిలో ఉంటానని ఆజాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో దళితుల ఓట్లు చీల్చి బీజేపీకీ లాభం చేకూర్చడానికే ఆజాద్‌ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.

ఈ నేపథ్యంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆజాద్‌.. మాయావతి ఎన్నటికీ దళితుల శ్రేయోభిలాసి కాలేరని.. కేవలం భీమ్‌ఆర్మీ మాత్రమే వారికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. అదే విధంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా తన అనునాయులకు ప్రమోషన్‌ ఇవ్వడం కోసం దళితులపై ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తులు తనను బీజేపీ ఏజెంట్‌ అనడం విడ్డూరంగా ఉందని... దళితులకు ఓటు వేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూల్చడం కూడా తెలుసునని హెచ్చరించారు.

కాగా వారం రోజులు కూడా తిరగకముందే ఆజాద్‌ తన స్టాండ్‌ మార్చుకోవడం విశేషం. మాయావతిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బ్రాహ్మణ నాయకుడు సతీష్‌ చంద్ర మిశ్రాను విమర్శించిన ఆజాద్‌... మోదీపై ఆయనను పోటీకి నిలబెడితే ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతునిస్తానంటూ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాకుండా తనపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి.. ‘ మా వాళ్లే నన్ను బీజేపీ ఏజెంట్‌ అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాయావతి ప్రధాన మంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కారణంగా ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం చేకూరకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసే అభ్యర్థిని ఎస్పీ-బీఎస్పీ కూటమి ఇంతవరకు ఖరారు చేయలేదు. 

చదవండి : మోదీపై కచ్చితంగా పోటీ చేస్తా : ఆజాద్‌

మరిన్ని వార్తలు

20-05-2019
May 20, 2019, 12:49 IST
పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు
20-05-2019
May 20, 2019, 12:40 IST
హైదరాబాద్‌: ‘పుల్వామా ఉగ్రదాడి’అనంతరం దేశం అంతా ఒక్కటిగా నిలవాల్సిన సమయంలో కొన్ని పార్టీలు పాకిస్తాన్‌ అనుకూల భాషను వాడటంతోనే ప్రజలు...
20-05-2019
May 20, 2019, 12:24 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఓట్ల...
20-05-2019
May 20, 2019, 11:56 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి...
20-05-2019
May 20, 2019, 11:51 IST
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): అప్పుడే ఎన్నికల అభ్యర్థుల గుండెల్లో లబ్‌డబ్‌ వేగం పెరుగుతోంది. గడియారంలో సెకెన్ల ముళ్లు కంటే వేగంగా కొట్టుకుంటోంది....
20-05-2019
May 20, 2019, 11:38 IST
న్యూఢిల్లీ : పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా...
20-05-2019
May 20, 2019, 11:27 IST
తిరుపతి రూరల్‌: దళితులు, గిరిజనులు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సైతం స్వేచ్ఛగా వినియోగించుకోలేని దుస్థితి రామచంద్రాపురం మండలంలో కొన్ని...
20-05-2019
May 20, 2019, 11:15 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ ఓట్ల లెక్కిం పు ప్రక్రియ సందర్భంగా ప టిష్ట భద్రత ఏర్పాటు చే యనున్నట్లు...
20-05-2019
May 20, 2019, 11:09 IST
తిరుపతి తుడా: కొన్నేళ్లుగా ఓటుకు దూరంగా ఉన్న దళితులకు ఆ హక్కును కల్పించడమే లక్ష్యంగా పోరాటం చేసినట్టు చంద్రగిరి ఎమ్మెల్యే...
20-05-2019
May 20, 2019, 11:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : నిన్న వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలన్ని తప్పని, తాను వాటిని విశ్వసించబోనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ అన్నారు....
20-05-2019
May 20, 2019, 10:49 IST
చంద్రబాబు పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్‌ పడనుందని శివసేన వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
20-05-2019
May 20, 2019, 10:07 IST
ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి.
20-05-2019
May 20, 2019, 09:34 IST
సాక్షి, ఒంగోలు అర్బన్‌: ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎటువంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల...
20-05-2019
May 20, 2019, 09:16 IST
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ...
20-05-2019
May 20, 2019, 09:08 IST
సాక్షి, అమరావతి బ్యూరో : కౌంటింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే గడువుంది. పోలింగ్‌కు కౌంటింగ్‌కు 43 రోజుల సుధీర్ఘ...
20-05-2019
May 20, 2019, 09:05 IST
ప్రజలు తమ అభిమానాన్ని వైఎస్‌ జగన్‌కు ఓట్ల రూపంలో చూపించారని నారాయణస్వామి చెప్పారు.
20-05-2019
May 20, 2019, 08:57 IST
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అందరిచూపు రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాపైనే ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో...
20-05-2019
May 20, 2019, 08:46 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పంకా.. విజయ ఢంకా ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో...
20-05-2019
May 20, 2019, 08:27 IST
సాక్షి, దర్శి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు ప్రత్యక్షమయ్యాయంటూ కలకలం రేగింది. కౌంటింగ్‌కు నాలుగు రోజులు...
20-05-2019
May 20, 2019, 08:17 IST
లగడపాటి రాజగోపాల్‌ది లత్కోర్‌ సర్వే అని శైలజ చరణ్‌ రెడ్డి ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top