
చీరకట్టులో విద్యార్థినుల సెల్ఫీ
కర్ణాటక, చిక్కబళ్లాపురం : పట్టణంలోని అగలగుర్కి బీ జీఎస్ పీయూ కళాశాలలో బుధవారం ఏర్పా టు చేసిన సాంస్కృతిక దినోత్సవ వేడుకల్లో యువతులు సందడి చేశారు. అచ్చమైన చీరకట్టుతో భారతీయ నృత్యరీతులకు అద్దం పడు తూ నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అహో అనిపించాయి. కార్యక్రమాన్ని ప్రారం భించిన ఆదిచుంచనగిరి ట్రస్టు నిర్వాహకులు నిర్మలానందనాథస్వామీజీ మాట్లాడుతూ పాశ్చా త్య సంస్కృతికి స్వస్తి చెప్పి భారతీయ ఆచార వ్యవహారాలను పాటించాలన్నారు.