కేంద్ర అఖిలపక్ష భేటీ సజావుగా జరిగిందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అన్నారు. అన్ని పార్టీల నేతలు సమావేశాలకు సహకరిస్తామని చెప్పారని తెలిపారు.
ముఖ్యంగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్డీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణ, విభజన హామీలపై వీరు ప్రస్తావించారని సమాచారం.