మోదీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ర్యాలీ | AwardWapsi: Anupam Kher to lead counter march in Delhi | Sakshi
Sakshi News home page

మోదీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ర్యాలీ

Nov 4 2015 6:19 PM | Updated on Jun 4 2019 6:31 PM

మోదీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ర్యాలీ - Sakshi

మోదీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ర్యాలీ

దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్నారు.

ఢిల్లీ:  దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్నారు. పలువురు సినీ దర్శకులు కూడా వీరికి మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రేస్ అధినేత్రి సోనియా గాంధీ ఆంధ్వర్యంలో రాష్ట్రపతి భవన్కు ర్యాలీని నిర్వహించి, పెరుగుతున్న అసహనంపై చర్యలు తీసుకోవాలని ప్రణబ్ను కోరారు.ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదనీ, అవార్డులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రాష్ట్రపతి భవన్కు ర్యాలీ నిర్వహించనున్నారు.

శనివారం నిర్వహించనున్న ర్యాలీలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ప్రజలు పాల్గొననున్నట్లు అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి, పెరుగుతున్న అసహనానికి సంబంధం లేదంటూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇది సత్యానికి సంబంధించిన ర్యాలీగా ఆమె తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement