తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే... | Arun Jaitley introduces maiden budget in Lok sabha | Sakshi
Sakshi News home page

తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే...

Jul 11 2014 1:45 AM | Updated on Mar 29 2019 9:04 PM

తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే... - Sakshi

తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే...

నరేంద్రమోడీని యావద్దేశంతో పాటు సొంత పార్టీ సైతం ‘నమో! నమామి!’ అనేలా చేసింది మధ్య తరగతి మహా భారతమే.

  •  100 స్మార్ట్ నగరాల ఏర్పాటుకు రూ. 7,060 కోట్లు 
  • ‘నమామి గంగ’ పేరుతో సమీకృత గంగా సంరక్షణ కార్యక్రమానికి రూ. 2,037 కోట్లు 
  • స్థూల రుణాలు రూ. 6 లక్షల కోట్లు
  • రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతానికి పెంపు 
  •  పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 58,425 కోట్లు 
  •  నెలవారీ కనీస పెన్షన్ రూ. 1,000 కి పెంపు
  •  సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు రూ. 200 కోట్లు
  •  
      ధరలు పెరిగేవి
    •   సిగరెట్లు
    •   పాన్ మసాలా
    •   గుట్కా
    •   నమిలే పొగాకు ఉత్పత్తులు
    •   జర్దా
    •   శీతల పానీయాలు
    •   రేడియో ట్యాక్సీ
    •   దిగుమతి చేసుకునే 
    •   ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
    •   పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు
    •   విరిగిన/హాఫ్ కట్ వజ్రాలు
     
     ధరలు తగ్గేవి
    •  సాదా (సీఆర్‌టీ) టీవీలు
    •   ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ టీవీలు 
    •   (ముఖ్యంగా 19 అంగుళాల కంటే 
    •   తక్కువ సైజువి)
    •   పాదరక్షలు.. సబ్బులు
    •   ఇ-బుక్ రీడర్లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు
    •   ఆర్‌వో టెక్నాలజీ వాటర్ ప్యూరిఫయర్లు
    •   ఎల్‌ఈడీ లైట్లు, గృహోపకరణాలు
    •   {బాండెడ్ పెట్రోల్
    •   సూక్ష్మ జీవిత బీమా పాలసీలు
    •   హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ఔషధాలు, 
    •   వ్యాధి నిర్ధారణ కిట్లు
     
     ఉద్యోగికి ఊరట
    •  ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు
    •  బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు
    •  దీంతో జేబులోకి అదనంగా రూ.5,000
    •  రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట
    •   సెక్షన్ 80సీ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు
    •  దీంతో అదనంగా రూ. 50,000 పొదుపు 
    •  గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షలకు... రూ. 15 వేల వరకూ ప్రయోజనం
    •  పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు 
    •  మొత్తంగా జనానికి కలిగే లబ్ధి విలువరూ. 22,000 కోట్లు
     
     మధ్యతరగతికి ఊరటనిచ్చిన మోడీ సర్కారు తొలి బడ్జెట్
     నరేంద్రమోడీని యావద్దేశంతో పాటు సొంత పార్టీ సైతం ‘నమో! నమామి!’ అనేలా చేసింది మధ్య తరగతి మహా భారతమే. ఆ రుణాన్ని మోడీ తొలి బడ్జెట్లోనే తీర్చుకున్నారు. తన తొలి బడ్జెట్లో పెద్దగా వాతలు వేయకుండానే...ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50 వేల మేరకు పెంచి ఆ వర్గాన్ని ఆనందపరిచారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ. సెక్షన్ 80సీ పరిధిలో పొదుపు చేసే మొత్తాన్ని మరో రూ. 50వేలు పెంచటమే కాక... గృహ రుణాలపై చెల్లించే వడ్డీకీ మినహాయింపు పెంచారు. మొత్తమ్మీద మధ్య తరగతి చేతిలో కాస్తంత డబ్బు మిగిలేలా చేశారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవటమే కాక.. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు. దేశాభివృద్ధిలో ప్రైవేటును విస్మరించలేమని స్పష్టంగా సంకేతమిచ్చారు. కొత్తగా ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తూ తమ అభివృద్ధి ఎజెండాను చెప్పకనే చెప్పారు. ఒక కోణంలో మరీ గొప్పగా కాకున్నా మధ్యస్తంగా ఓకే అనిపించినా... పాతికేళ్ల సంకీర్ణ చరిత్రను బద్దలుగొడుతూ సొంతంగా మెజారిటీ సాధించిన సర్కారు స్థాయిలో మోడీ ప్రభుత్వం ఆలోచించలేదనే చెప్పాలి. కఠిన నిర్ణయాలు తప్పవంటూ నెలరోజులుగా ఊదరగొట్టినా... ద్రవ్యలోటుతో సహా అన్ని అంశాల్లోనూ యూపీఏ బాటలోనే నడిచారు. దాదాపు 28 పథకాలకు తలా రూ. 100 కోట్లు కేటాయిస్తూ పోయిన అరుణ్ జైట్లీ... తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే ఉన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement