
ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ వర్సిటీ
తన బడ్జెట్ తొలి భాగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వరాలను ప్రకటించారు. రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వ విద్యాలయాలను ఆయన కేటాయించారు.
తన బడ్జెట్ తొలి భాగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వరాలను ప్రకటించారు. రాష్ట్రానికి ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వ విద్యాలయాలను ఆయన కేటాయించారు. అయితే, ఇంతకుముందు విభజన సమయంలో చెప్పినట్లుగా ఐఐఎంను మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యానవన విశ్వవిద్యాలయం ఒకదాన్ని ఆయన కేటాయించారు.
దేశం మొత్తమ్మీద ఐదు కొత్త ఐఐటీలను ఏర్పాటుచేయబోతున్నట్లు జైట్లీ ప్రకటించారు. వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐఐటీని ఇచ్చారు. దాంతోపాటు రెండు సంస్థలను కూడా ఆయన కేటాయించారు.