వారసుడి ఎంపికలో ప్రతిష్టంభన | AIADMK Crucial Legislative Meeting end | Sakshi
Sakshi News home page

వారసుడి ఎంపికలో ప్రతిష్టంభన

Dec 5 2016 9:18 PM | Updated on Sep 4 2017 9:59 PM

వారసుడి ఎంపికలో ప్రతిష్టంభన

వారసుడి ఎంపికలో ప్రతిష్టంభన

జయలిత వారసుడి ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

చెన్నై: జయలలిత వారసుడి ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో జయ విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వంకు పూర్తి మద్దతు దక్కలేదని సమాచారం. జయ వారసుడిని ఎంపిక చేసేందుకు మళ్లీ సమావేశం కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మధ్యాహ్నం సమావేశమైన ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను తమ నాయకుడిగా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. 
 
మరోవైపు జయలలితకు రాత్రి 11 గంటలకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నివేదికలు పరిశీలించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు మరోసారి ప్రకటన చేయనున్నారు. అపోలో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో మొబైల్‌ నెట్‌ వర్క్‌ సేవలు నిలిచిపోయాయి. 
 
కాగా, తమిళనాడులో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ఢిల్లీలో చెప్పారు. తమిళనాడులోని పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement