కొత్త కేబినెట్ కు మాజీ సీఎం సెల్యూట్ | Achuthanandan salutes the new LDF ministry of Vijayan | Sakshi
Sakshi News home page

కొత్త కేబినెట్ కు మాజీ సీఎం సెల్యూట్

May 25 2016 1:16 PM | Updated on Sep 4 2017 12:55 AM

కొత్త కేబినెట్ కు మాజీ సీఎం సెల్యూట్

కొత్త కేబినెట్ కు మాజీ సీఎం సెల్యూట్

విజయన్ నేతృత్వంలో ఏర్పడబోయే ఎల్డీఎఫ్‌ సంకీర్ణ ప్రభుత్వం ప్రజల మద్దతుతో మంచి పరిపాలన అందించాలని కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ ఆకాంక్షించారు.

తిరువనంతపురం: పినరయి విజయన్ నేతృత్వంలో ఏర్పడబోయే ఎల్డీఎఫ్‌ సంకీర్ణ ప్రభుత్వం ప్రజల మద్దతుతో మంచి పరిపాలన అందించాలని కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ ఆకాంక్షించారు. కేరళను విజయన్ ప్రభుత్వం ప్రగతిపథంలో నడిపిస్తుందన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ఈ మేరకు తన అభిప్రాయాలను పేస్‌ బుక్ లో పోస్ట్ చేశారు. విజయన్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడబోయే కేబినెట్ కు ఆయన అభినందలు తెలుపుతూ సెల్యూట్ చేశారు.

తమ ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి విజయన్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. కేరళలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కూడా అచ్యుతానందన్ స్పందించారు. ప్రగతిశీల ప్రభుత్వాలను కూలదోసేందుకు కాషాయ పార్టీ వెనుకాడబోదని, వామపక్షాలు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement