ఒక్క రాత్రిలో 86 బైక్లను తగలబెట్టారు | 86 vehicles torched in Pune's Sun city | Sakshi
Sakshi News home page

ఒక్క రాత్రిలో 86 బైక్లను తగలబెట్టారు

Jun 28 2015 3:08 PM | Updated on Sep 3 2017 4:32 AM

ఒక్క రాత్రిలో 86 బైక్లను తగలబెట్టారు

ఒక్క రాత్రిలో 86 బైక్లను తగలబెట్టారు

ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 86 టూవీటర్స్ను రాత్రికిరాత్రే ఒక్క రాత్రిలో 86 బైక్లను తగలబెట్టారు గుర్తుతెలియని దుండగులు.

పుణె: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 86 టూవీటర్స్ను రాత్రికిరాత్రే ఒక్క రాత్రిలో 86 బైక్లను తగలబెట్టారు  గుర్తుతెలియని దుండగులు. పుణెలోని సన్ సిటీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు మూడు, నాలుగు గంటల ప్రాంతంలో సన్ సిటీ వద్దకు చేరుకున్న దుండగులు వివిధ అపార్ట్మెంట్లు, షాపుల ముందు నిలిపి ఉంచిన వాహనాల పెట్రోల్ పైపును తొలిగించి నిప్పుపెట్టినట్లు స్థానిక ఇన్స్పెక్టర్ కషిద్ చెప్పారు.

చుట్టూ మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు తమకు సమాచారం అందిచారని, ఓ పిజ్జా షాపు వద్ద అధికంగా 25 వాహనాల తగలబడ్డాయని కషిద్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజిల ఆధారంగా ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఓ యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్ది నెలల కిందట ధంన్కావాడీ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటనలు జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement