లక్నో విద్యార్థుల గిన్నిస్‌ రికార్డ్‌ 

550 Lucknow Students Set Guinness Record - Sakshi

లక్నో: సుమారు 550 మంది విద్యార్థులు ఏక కాలంలో అరటి పండు నుంచి డీఎన్‌ఏను వేరు చేసి గిన్నిస్‌ రికార్డు సాధించారు. ఇండియా ఇంటర్నేషన్‌ సైన్స్‌ ఫెస్టివల్‌లో (ఐఐఎస్‌ఎఫ్‌ 2018)లోభాగంగా వీరు ఈ ఘనత సాధించారు. లక్నోకు చెందిన జీడీ గోయెంకా పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 13–17 ఏళ్ల విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేశారు. శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అనుగుణంగా స్లైడర్స్‌తో 61 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. గతంలో అమెరికాకు చెందిన 302 విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ఎన్‌బీఆర్‌ఐ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ ఎస్‌.కె బారిక్, బయోటెక్‌ పార్క్‌ సీఈఓ ప్రమోద్‌ టాండన్‌లు చిన్నారుల ప్రయోగాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నిర్ణేత రిషీనాథ్‌ 550 మంది విద్యార్థులకు ధ్రువపత్రాన్ని అందజేశారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top