నిన్ను నీవే జయించు | Yatra song Samara Shankham is about YSR Reddy’s famous walkathon | Sakshi
Sakshi News home page

నిన్ను నీవే జయించు

Sep 3 2018 1:21 AM | Updated on Sep 3 2018 1:21 AM

Yatra song Samara Shankham is about YSR Reddy’s famous walkathon - Sakshi

‘‘ఈ కనులలో కొలిమై.. రగిలే కలేదో నిజమై తెలవారనీ... వెతికే వెలుగై రానీ.. ఈనాటి ఈ సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం... ఈ సంధ్యలో స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం... ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది.. అంతరంగమే కదనరంగమైనది.. ప్రాణమే బాణమల్లే తరుముతున్నది.. నిన్ను నీవే జయించి రార రాజశేఖరా...’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా సాగే ‘యాత్ర’ లోని తొలి పాటని చిత్రబృందం విడదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోని మొదటి పాటని విడదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడపకు వెళ్లి పేదవాడి కష్టాలు.. అక్కచెల్లెళ్ల బాధలు.. రైతుల ఆవేదన తెలుసుకున్న గొప్ప నాయకుడు రాజశేఖరరెడ్డిగారు. ప్రజల కష్టాల్ని తన కళ్లతో చూసి జనరంజక పాలనతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన ఎకైక మహానేత ఆయన.  వైఎస్‌గారి ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ‘యాత్ర’ తెరకెక్కిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘ఈ కనులలో కొలిమై’ పాటకి కృష్ణ కుమార్‌ మంచి సంగీతం అందించాడు’’ అన్నారు. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement