బాహుబలి.. మరో ప్రశ్న! | Wondering who was Bhallaladeva's wife in Baahubali 2? Rana Daggubati has an answer for you | Sakshi
Sakshi News home page

బాహుబలి.. మరో ప్రశ్న!

May 10 2017 2:06 PM | Updated on Sep 5 2017 10:51 AM

బాహుబలి.. మరో ప్రశ్న!

బాహుబలి.. మరో ప్రశ్న!

భద్ర తల్లి ఎవరనే ప్రశ్నకు భల్లాలదేవ(దగ్గుబాటి రానా) సరదాగా సమాధానం ఇచ్చాడు.

‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. వీటికి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌‌’  సమాధానాలు దొరుకుతాయని భావించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదు. భల్లాలదేవుడి భార్య ఎవరు? అనేది అందులో ఒకటి. భద్ర(అడివి శేష్‌)ను భల్లాలదేవ కుమారుడిగా మొదటి భాగంలో చూపించారు. దేవసేనను భల్లాలదేవ చెర నుంచి విడిపించే సమయంలో భద్రను చంపుతాడు మహేంద్ర బాహుబలి(శివుడు).

అయితే బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరో చూపిస్తారని ఆశించిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. భద్ర తల్లి ఎవరనే ప్రశ్నకు భల్లాలదేవ(దగ్గుబాటి రానా) సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘ సరోగసి(అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని, అతడికి తల్లి లేద’ని సరదాగా జవాబిచ్చాడు. మొత్తానికి భల్లాలదేవ ప్రేక్షకుల అనుమానాన్ని నివృత్తి చేశాడు. ప్రేక్షకుల ప్రశ్నల మాటెలావున్నా బాక్సాఫీస్‌ వద్ద ‘బాహుబలి 2’  హవా కొనసాగుతోంది. రెండో వారంలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement