'మా' అందరిదీ ఒకే కుటుంబం: మురళీమోహన్ | we are one family, says murali mohan | Sakshi
Sakshi News home page

'మా' అందరిదీ ఒకే కుటుంబం: మురళీమోహన్

Apr 17 2015 1:24 PM | Updated on Sep 3 2017 12:25 AM

ఎన్నికల వరకు మాత్రమే వేర్వేరు వర్గాలుగా ఉంటామని.. ఎన్నికలు ముగిసిన తర్వాత 'మా' సభ్యులంతా ఒకే కుటుంబంగా ఉంటామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ తెలిపారు.

ఎన్నికల వరకు మాత్రమే వేర్వేరు వర్గాలుగా ఉంటామని.. ఎన్నికలు ముగిసిన తర్వాత 'మా' సభ్యులంతా ఒకే కుటుంబంగా ఉంటామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఆయన కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అధ్యక్షుడిగా జీవీ రాజేంద్రప్రసాద్ 85 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఆయన ప్రకటించారు. ఇతరుల మెజారిటీలను కూడా స్వయంగా మురళీ మోహనే చదివి వినిపించారు. ఎవరెవరికి ఎంతెంత మెజారిటీ వచ్చిందంటే...

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తనికెళ్ల భరణి - 169
జనరల్ సెక్రటరీ శివాజీరాజా - 36
కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు - 159
జాయింట్ సెక్రటరీ నరేష్ -224
జాయింట్ సెక్రటరీ రఘుబాబు -239

ఎగ్జిక్యూటివ్ సభ్యులు
బెనర్జీ - 281; బ్రహ్మాజీ -303; ఛార్మి - 249; ఢిల్లీ రాజేశ్వరి - 262; ఏడిద శ్రీరామ్- 255; శశాంక -283; గీతాంజలి - 285; హేమ- 252; జాకీ-311; జయలక్ష్మి -250; కాదంబరి కిరణ్-310; నర్సింగ్ యాదవ్- 302; రాజీవ్ కనకాల-315; విద్యాసాగర్-215

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement