బయోపిక్‌ నం 3

vivek agnihotri next movie is apj abdul kalam biopic - Sakshi

దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ జీవితం ఆధారంగా రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పటికే వచ్చాయి. నిర్మాత అనిల్‌ సుంకరతో కలసి, అభిషేక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ అధినేత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జగదీష్‌ దానేటి, జానీ మార్టిన్‌ దర్శకత్వంలో ఇండో–హాలీవుడ్‌ చిత్రంగా కలామ్‌ బయోపిక్‌ తీస్తున్నట్టు ప్రకటించారు. కలామ్‌గా అలీ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కలామ్‌ జీవితంపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కలామ్‌పై సినిమా తీసే రైట్స్‌ మా దగ్గరే ఉన్నాయి మరెవ్వరూ సినిమా తీయడానికి వీల్లేదు అని అభిషేక్‌ ఆర్ట్స్‌ సంస్థ›పేర్కొంది. దాంతో ఆసక్తి ఏర్పడింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top