సింగంగా సంపూ | Vishnu to produce Sampoornesh Babu's Singham 123 | Sakshi
Sakshi News home page

సింగంగా సంపూ

Sep 28 2014 11:41 PM | Updated on Sep 2 2017 2:04 PM

సింగంగా సంపూ

సింగంగా సంపూ

మంచు విష్ణు... తన కుటుంబ కథానాయకులతో కాకుండా తొలిసారి బయట హీరోతో సినిమాను నిర్మించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు. ‘హృదయకాలేయం’తో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక

మంచు విష్ణు... తన కుటుంబ కథానాయకులతో కాకుండా తొలిసారి బయట హీరోతో సినిమాను నిర్మించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు. ‘హృదయకాలేయం’తో ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్‌బాబు. సినిమా పేరు ‘సింగం 123’. అక్షత్‌శర్మ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సంపూ అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకులకు నచ్చేలా ‘సింగం 123’ ఉంటుందని, ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఇందులో యాక్షన్, కామెడీ అంశాలుంటాయని దర్శకుడు చెప్పారు. ‘సింగం 123’గా సంపూ ఎలా ఉంటారో తెలియజేయడానికి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశామని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement