విక్రమ్‌ మరో ప్రయోగం, బుసలు కొడుతున్న కోబ్రా

Vikram Film Cobra Title Motion Poster Released - Sakshi

కథలతో ప్రయోగాలు చేసే తమిళ ప్రముఖ హీరో విక్రమ్‌ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. ‘అపరిచితుడు’ చిత్రంతో తెలుగులో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత విక్రమ్‌ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ రిలీజయ్యాయి. కానీ కొన్ని మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా మిగతావి పత్తా లేకుండా పోయాయి. ఈ క్రమంలో మరో డిఫరెంట్‌ చిత్రంతో విక్రమ్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న విక్రమ్‌ 58వ సినిమాకు ‘కోబ్రా’ అని టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ సందర్భంగా బుధవారం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకవైపు ఆసక్తిని రేకెత్తిస్తూనే మరోవైపు భయాన్ని కలగజేస్తున్న ఈ వీడియోలో పాములు భయంకరంగా బుసలు కొడుతున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి హీరో విక్రమ్‌తో జోడీ కడుతోంది. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించగా లలిత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top