ఇద్దరు యముళ్ల చిత్రం యమన్ | vijay antony's yaman | Sakshi
Sakshi News home page

ఇద్దరు యముళ్ల చిత్రం యమన్

Feb 5 2017 2:17 AM | Updated on Sep 5 2017 2:54 AM

ఇద్దరు యముళ్ల చిత్రం యమన్

ఇద్దరు యముళ్ల చిత్రం యమన్

ఇద్దరు యమధర్మరాజుల్లాంటి విజయ్‌ఆంటోని, జీవీ శంకర్‌ల చిత్రం యమన్ అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యనించారు.

ఇద్దరు యమధర్మరాజుల్లాంటి విజయ్‌ఆంటోని, జీవీ శంకర్‌ల చిత్రం యమన్  అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యనించారు. కథానాయకుడిగా,సంగీతదర్శకుడిగా వరస విజయాలను సాధిస్తున్న విజయ్‌ఆంటోని తాజా చిత్రం యమన్ . లైఖా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాన్  చిత్రం ఫేమ్‌ జీవీశంకర్‌ దర్శకుడు. మియాజార్జ్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు త్యాగరాజన్ పోషించారు.ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ మాల్‌లో ఘనంగా జరిగింది. సీనియర్‌ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్, గోపురం ఫిలింస్‌ అన్భుసెలియన్  ముఖ్యఅతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి సీడీని యువ నటుడు విజయ్‌సేతుపతి అందుకున్నారు. ఈ సందర్భంగా లైకా సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం మాట్లాడుతూ సంగీతదర్శకుడు, చాయాగ్రాహకుడు చిత్రానికి రెండు పిల్లర్లలాంటి వారన్నారు.

తమ చిత్రానికి కథానాయకుడు, సంగీతదర్శకుడు ఒకరే కావడం లక్కీ అన్నారు. అదే విధంగా ఛాయాగ్రహకుడు జీవా శంకర్‌ యమన్  చిత్రానికి, దర్శకుడు కావడం బాగా ప్లస్‌ అయ్యిందన్నారు. ఇక ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించిన నటుడు త్యాగరాజన్ ర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.ఈ యమన్  చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతరం నటుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ యమన్ దర్శకుడు జీవశంకర్‌ మొదట తనకు చెప్పారన్నారు.

అయితే ఈ కథకు పర్ఫెక్ట్‌ కథానాయకుడు విజయ్‌ఆంటోని అనిపించిందని ఆయన ఇందులో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. విజయ్‌ఆంటోని, జీవాశంకర్‌ లాంటి ఇద్దరు యమధర్మరాజులు చేసిన చిత్రం యమన్  అని పేర్కొన్నారు. విజయ్‌ఆంటోని తొలిసారిగా ఈ చిత్రంలో డ్యాన్స్  చేశారని, అది చూడాలన్న ఆసక్తి తనకు కలుగుతోందని అన్నారు.ఈ కార్యక్రమంలో జ్ఞానవేల్‌రాజా, టి.శివ, శశి, ఐన్ న్  కరుణాకరన్, కాట్రగడ్డ ప్రసాద్, రూపామంజరి, చిత్ర నాయకి మియాజార్జ్‌  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement