3డీలో సూర్య | Venkat Prabhu's 3D film with Surya | Sakshi
Sakshi News home page

3డీలో సూర్య

Jan 20 2014 2:20 AM | Updated on Sep 2 2017 2:47 AM

3డీలో సూర్య

3డీలో సూర్య

నటుడు సూర్య 3డిలో థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కథతో పాటు పాత్ర, గెటప్‌లలోనూ వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్న సూర్య తాజాగా

 నటుడు సూర్య 3డిలో థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కథతో పాటు పాత్ర, గెటప్‌లలోనూ వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్న సూర్య తాజాగా సాంకేతిక పరంగానూ ఆధునిక టెక్నాలజీ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కార్తీతో బిరియాని వండిన వెంకట్ ప్రభు ఇప్పుడు ఆయన సోదరుడు సూర్యతో పసందైన 3డి చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. 
 
 దీని గురించి వెంకట్ ప్రభు మాట్లాడుతూ, సూర్యతో రూపొందించే కథ చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఈ చిత్రానికి కల్యాణరామన్ అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని అయితే ఇంకా టైటిల్‌ను పెట్టలేదని చెప్పారు. కల్యాణరామన్ పేరుతో పాటు తమ బృందం మరికొన్ని పేర్లు ఆలోచిస్తోందని తెలిపారు. ఈ చిత్రాన్ని తొలిసారిగా 3డీ ఫార్మెట్‌లో చిత్రీకరించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఇందుకు బడ్జెట్ సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాల గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే చిత్రాన్ని 3డీలో తెరకెక్కించనున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు. అయితే ఈ చిత్రం అభిమానులకు అద్భుతమైన అనుభూతి నిస్తుందని ఆయన అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement