వీడే సరైనోడు

veede sarainodu released on sept 6 - Sakshi

జీవా, నయనతార జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘తిరునాళ్‌’ తెలుగులో విడుదల కానుంది. కోకా శిరీష సమ్పణలో నోవా సినిమాస్‌ పతాకంపై నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ‘వీడే సరైనోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.  సెప్టెంబర్‌ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఏడాదికి దాదాపుగా 150 చిన్న సినిమాలు విడుదల  అవుతుంటాయి.

అందులో 30 వరకు డబ్బింగ్‌ సినిమాలు వస్తుంటాయి. ఈ డబ్బింగ్‌ చిత్రాలు పెద్ద చిత్రాలకు పునాదులు లాగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ప్రసన్నకుమార్‌. ‘‘సినిమా విడుదలకు మంచి డేట్‌ కుదిరింది. నయనతార, జీవా నటన చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాత మోహన్‌ వడ్లపట్ల.  ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని చిత్రనిర్మాత జక్కుల నాగేశ్వరరావు అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top