ఫన్‌ రైడ్‌ | Varun Tej begins shooting for his upcoming multi-starrer with Venkatesh F2 | Sakshi
Sakshi News home page

ఫన్‌ రైడ్‌

Jul 6 2018 12:42 AM | Updated on Jul 6 2018 12:43 AM

Varun Tej begins shooting for his upcoming multi-starrer with Venkatesh F2 - Sakshi

ప్రియదర్శి, శిరీష్, వరుణ్‌ తేజ్, అనిల్‌ రావిపూడి, సాయికృష్ణ

... స్టార్ట్‌ చేశారు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ అండ్‌ టీమ్‌. ఈ రైడ్‌లో ఎవరి అల్లరి ఎక్కువగా ఉంది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనేది ఉపశీర్షిక. ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో గురువారం హీరో వరుణ్‌ తేజ్‌ జాయిన్‌ అయ్యారు. ‘‘ఎఫ్‌ 2’ మొదలైంది. మరో అందమైన రోజున సరికొత్త అధ్యాయం మొదలుపెట్టాను. ఎగై్జటింగ్‌ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. ఈ షెడ్యూల్‌ ఈ నెల 21 వరకు సాగుతుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో వెంకీ, వరుణ్‌ తోడల్లుళ్ల పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. టైటిల్‌ని బట్టి ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ అని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement