రజనీ చిత్ర టైటిల్‌లో ఉదయనిధి | Udhayanidhi get Rajinikanth's film title | Sakshi
Sakshi News home page

రజనీ చిత్ర టైటిల్‌లో ఉదయనిధి

Jan 15 2016 2:27 AM | Updated on Sep 3 2017 3:41 PM

రజనీ చిత్ర టైటిల్‌లో ఉదయనిధి

రజనీ చిత్ర టైటిల్‌లో ఉదయనిధి

తమిళసినిమాలకు పేర్ల కొరత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ పన్ను

తమిళసినిమాలకు పేర్ల కొరత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాయితీలు ఒక కారణం కావచ్చు. చిత్రాల పేర్లు తమిళంలో ఉంటేనే రాయితీలన్న ప్రభుత్వ నిబంధనలు దర్శకనిర్మాతను ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. పేర్ల కొరత కారణంగానే పాత పేర్ల అన్వేషణలో పడుతున్నారు. ఇక పలువురు కుర్ర హీరోలు సూపర్‌స్టార్ చిత్రాల పేర్లను తమ చిత్రాలకు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు.

రజనీకాంత్ స్థాయికి ఎలాగూ చేరలేం. ఆయన చిత్రాల పేర్లతోనైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనే భావిస్తున్నారు. రజనీకాంత్ చిత్రాల పేర్లతో ఇప్పటికే కొన్ని చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం నటుడు జీవా పోకిరిరాజా, విజయ్‌సేతుపతి ధర్మదురై పేర్లను వాడుకుంటున్నారు.ఈ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.తాజాగా ఉదయనిధి స్టాలిన్ సూపర్‌స్టార్ చిత్ర టైటిల్‌ను వాడుకోవడానికి రెడీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం గెత్తు గురువారం తెరపైకి వచ్చింది. తదుపరి చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బీ రీమేక్‌లో ఉదయనిధిస్టాలిన్ నటిస్తున్నారు.ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం ఫేమ్ అహ్మద్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి హన్సిక నాయకిగా నటిస్తున్నారు.ఉదయనిధి స్టాలిన్ తొలి చిత్రం(ఒరుకల్ ఒరుకన్నాడి)కథానాయకి ఈమె అన్నది గమనార్హం. ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి మణిదన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం టైటిల్ అన్న విషయం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement