యాక్షన్‌ ప్లాన్‌

Tiger Shroff, Shraddha Kapoor starrer goes on floors - Sakshi

శత్రువులపై దాడి చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌. ఈ ప్లాన్‌లో నేనూ పాలుపంచుకుంటాను అంటున్నారు శ్రద్ధా కపూర్‌. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ‘భాగీ 3’. ౖటైగర్‌ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్‌ దర్శకుడు. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం టైగర్‌ ష్రాఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది.  టైగర్, శ్రద్ధా, రితేష్‌ దేశ్‌ముఖ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్‌ చేశారు. అక్టోబ రులో ‘భాగీ 3’ బృందం జార్జియా వెళ్లనుందని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top