చాలా స్పెషల్‌ | Third schedule of Ninne Chusthu begins | Sakshi
Sakshi News home page

చాలా స్పెషల్‌

Mar 26 2018 1:46 AM | Updated on Mar 26 2018 1:46 AM

Third schedule of Ninne Chusthu begins  - Sakshi

శ్రీకాంత్, హేమలత

నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత (బుజ్జి) ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నే చూస్తు’. కె.గోవర్ధన్‌రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్‌ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్నారు. సుహాసిని, సుమన్, భానుచందర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల రెండో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. హేమలతా రెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సంగీత దర్శకుడు రమణ్‌ రాథోడ్‌ అద్భుతమైన పాటలు అందించారు.

ఈ చిత్రానికి ‘నిన్నే చూస్తు’ టైటిల్‌ సాంగ్‌ చాలా ప్రత్యేకం. మలేషియాలోని అందమైన లొకేషన్స్‌లో తెరకెక్కించాం. పాట అవుట్‌పుట్‌ చూసి యూనిట్‌ సభ్యులు సంతోషించారు. నృత్యదర్శకురాలు రేఖ కొరియోగ్రఫీ మరో హైలైట్‌. త్వరలోనే షూటింగ్‌ పూర్తవుతుంది’’ అన్నారు. సన, కాశీ విశ్వనాథ్, సాయాజీ షిండే, ‘వెన్నెల’ కిశోర్, రజిత తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ప్రసాద్‌ ఈదర (శంకర్‌ కుమార్‌ ), శంకర్‌ (సెకండ్‌ కెమెరామెన్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement