దేశం కోసం | The Indo-Pak 1970s war scenes reflect the movie ... raazi | Sakshi
Sakshi News home page

దేశం కోసం

Jul 1 2017 11:22 PM | Updated on Sep 5 2017 2:57 PM

దేశం కోసం

దేశం కోసం

కన్నతల్లంటే ఎంత ప్రేమో, మాతృదేశమంటే అంతే ప్రేమ ఆ యువతికి. దేశసేవ చేస్తే ప్రజాసేవ చేసినట్లే అని నమ్ముతుంది.

కన్నతల్లంటే ఎంత ప్రేమో, మాతృదేశమంటే అంతే ప్రేమ ఆ యువతికి. దేశసేవ చేస్తే ప్రజాసేవ చేసినట్లే అని నమ్ముతుంది. అందుకే దేశ రక్షణలో భాగంగా శత్రుదేశ ఆర్మీ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకు ఎంతో ధైర్యం కావాలి. అంతకు మించిన దేశభక్తి నరనరాన జీర్ణించుకుని ఉండాలి.

సరిగ్గా ఇలాంటి దేశభక్తి కలిగిన భారతీయ కాశ్మీరీ అమ్మాయి పాత్రలో తన తర్వాతి చిత్రం ‘రాజీ’లో నటించనున్నారు క్యూట్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌.  విక్కీ కౌశల్, ఆలియా ముఖ్యతారలుగా మేఘనా గుల్జార్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. ‘‘ఇండో–పాక్‌ 1970 యుద్ధ సన్నివేశాలను ప్రతిబింబించేలా లొకేషన్లను ప్లాన్‌ చేస్తున్నాం. స్క్రిప్ట్‌పై మరింత పరిశోధన చేస్తున్నాం’’ అని ఓ సందర్భంలో దర్శకురాలు మేఘనా గుల్జార్‌ అన్నారు. హరీందర్‌ సిక్కా రాసిన ‘కాలింగ్‌ సెహామత్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement