గ్రామీణ నేపథ్యంలో...

Tanishq Reddy From Sakala Kala Vallabhudu - Sakshi

‘‘దర్పణం’ సినిమా ఫేమ్‌ తనిష్క్‌రెడ్డి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. శివ గణేష్‌ దర్శకత్వంలో యువన్‌ టూరింగ్‌ టాకీస్, సింహా ఫిలిమ్స్‌ పతాకాలపై అనిల్‌కుమార్‌ గుంట్రెడ్డి నిర్మిస్తున్నారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్‌ అండ్‌  కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. జనవరి 3నుంచి పార్వతీపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేయనున్నాం.

ఆస్ట్రేలియాలో కూడా ఒక షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం. ఓ ప్రముఖ హీరోయిన్‌ నటించనున్నారు. తనిష్క్‌ కెరీర్‌ని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమవుతుందనడంలో సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. సుమన్, వినోద్‌కుమార్, చిన్నా, పృధ్వీ, జీవా, ఉత్తేజ్, అనంత్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అజయ్‌ పట్నాయక్, కెమెరా: సాయి చరణ్, కో–ప్రొడ్యూసర్స్‌: శ్రీకాంత్, త్రినాథ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: చిన్నా, నాగేంద్రమ్మ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top