నిఖిల్ సరసన నందిత | Tamil actor Nandita Swetha to make Telugu debut in Nikhil's next | Sakshi
Sakshi News home page

నిఖిల్ సరసన నందిత

Apr 15 2016 3:41 PM | Updated on Sep 3 2017 10:00 PM

నిఖిల్ సరసన నందిత

నిఖిల్ సరసన నందిత

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజా చిత్రంలో తమిళ నటి నందితా శ్వేత కధానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది.

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజా చిత్రంలో తమిళ నటి నందితా శ్వేత కధానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది. కొన్ని నెలల పాటు కొత్త హీరోయిన్ కోసం అన్వేషించిన చిత్ర యూనిట్ ఫైనల్గా నందితా శ్వేతను ఎంపిక చేసినట్లు తెలిసింది.  ఇప్పటికే నిఖిల్ సరసన ఈ సినిమాలో అవికా గోర్, హెబా పటేల్లు హీరోయిన్లుగా నటిస్తుండగా నందిత కూడా అలరించనుంది.
 
తెలుగులో అవకాశాలు తలుపు తట్టినప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు ఏ సినిమా అంగీకరించలేదని నందిత చెబుతోంది. ప్రస్తుతం ఓ హర్రర్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. అది పూర్తవగానే నిఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. యూత్ను ఆకట్టుకునే ప్రేమకధగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. ఆనంద్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర స్వరాలందిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement