రయ్‌ రయ్‌మంటూ...

Tamannaah Bhatia to play leading lady in Sundar C's next Tamil film - Sakshi

ప్రస్తుతం బ్రేకులు లేని బండిలా తమన్నా రయ్‌ రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. తెలుగులో ‘ఎఫ్‌ 2, సైరా నరసింహారెడ్డి’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో విశాల్‌ హీరోగా నటిస్తారు. ‘‘చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి సుందర్‌ సార్‌ డైరెక్షన్‌లో వర్క్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. పక్కా యాక్షన్‌ చిత్రమిది.

విశాల్‌తో సెకండ్‌ టైమ్‌ నటించనుండటం హ్యాపీ’’ అని తమన్నా పేర్కొన్నారని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇంతకుముందు తమిళ సినిమా ‘కత్తి సండై’లో విశాల్, తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో రిలీజైంది. అయితే ప్రస్తుతం సుందర్‌. సి తెలుగు హిట్‌ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. అలాగే విశాల్‌ కూడా తెలుగు హిట్‌ ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌ ‘అయోగ్య’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు ఈ ప్రాజెక్ట్స్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత విశాల్‌–తమన్నా –సుందర్‌. సి కాంబినేషన్‌ సినిమా స్టార్ట్‌ అవుతుంది.

ప్రస్తుతం వెంకటేష్, వరుణ్‌తేజ్‌ మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’ షూటింగ్‌ నిమిత్తం యూరప్‌లోని ప్రాగ్‌లో ఉన్నారు తమన్నా. ‘క్వీన్‌’కి తెలుగు రీమేక్‌గా ఆమె నటించిన  ‘దటీజ్‌ మహాలక్ష్మి’, తమిళంలో చేసిన ‘కన్నే కలైమానే’ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. సౌత్‌లో కాకుండా హిందీలో కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో తమన్నా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఆమె డైరీ ఫుల్‌గా ఉంది. కన్నడ ‘కేజీఎఫ్‌’లో ఐటమ్‌ సాంగ్‌ చేసిన తమన్నా, తెలుగులో ‘సవ్యసాచి’లో కూడా ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయనున్న సంగతి గుర్తుండే ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top