జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు! | Sylvester Stallone to play John Rambo for the fifth time! | Sakshi
Sakshi News home page

జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు!

Jun 26 2014 11:31 PM | Updated on Sep 2 2017 9:26 AM

జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు!

జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు!

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రాంబో’ యాక్షన్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా వివరించనవసరంలేదు. సిల్వెస్టర్ స్టాలోన్‌ను హాలీవుడ్ సూపర్ స్టార్ చేసిన సినిమాలు అవి.

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రాంబో’ యాక్షన్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా వివరించనవసరంలేదు. సిల్వెస్టర్ స్టాలోన్‌ను హాలీవుడ్ సూపర్ స్టార్ చేసిన సినిమాలు అవి.  రాంబో పాత్రను స్టాలోన్ మొదటిసారి పోషించిన చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’. 1982లో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో ఆయన చేసిన పోరాట దృశ్యాలు చూసి, ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఈ చిత్రానికి లభించిన ఆదరణతో ఆ తర్వాత మరో మూడు రాంబో సిరీస్ చిత్రాల్లో నటించారు స్టాలోన్. ఆ విధంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు వచ్చాయి. నాలుగోది 2008లో విడుదలైంది.
 
  ఈ నాలుగు రాంబో చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఐదోసారి రాంబోగా కనబడటానికి స్టాలోన్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా ఆయనే సమకూరుస్తున్నారు. మొదటిసారి జాన్ రాంబో పాత్ర చేసినప్పుడు స్టాలోన్ వయసు దాదాపు 36 ఏళ్లు. ఇప్పుడాయన వయసు 67. మరి.. ఈ వయసులో పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయం స్టాలోన్‌కి తెలియకేం కాదు. కానీ, తన అభిమానులను నిరుత్సాహపరచకూడదనే పట్టుదలతో ఈ సినిమా కోసం వర్కవుట్లు చేస్తున్నారట స్టాలోన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement