బాలయ్యతో ఢీ.. గ్యాంగ్ రెడీ

Suriya Gang Joins Sankranti Race With Jai Simha  - Sakshi

సంక్రాంతికి సూపర్ హిట్ రికార్డు ఉన్న నందమూరి బాలకృష్‌న 2018 సంక్రాంతికి ‘జై సింహా’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత‍్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు ‘గ్యాంగ్’ రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో విఘ్నేష్ శివన్ దర‍్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్. బాలీవుడ్ సూపర్ హిట్ స్పెషల్ 26 ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతోంది. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top