కథలు రాస్తున్న సన్నీలియోన్ | Sunny Leone writes erotic fiction | Sakshi
Sakshi News home page

కథలు రాస్తున్న సన్నీలియోన్

May 28 2016 1:26 PM | Updated on Sep 4 2017 1:08 AM

కథలు రాస్తున్న సన్నీలియోన్

కథలు రాస్తున్న సన్నీలియోన్

బాలీవుడ్ హీరోయిన్గా మారిన ఎడల్ట్ మూవీ స్టార్ సన్నీలియోన్, మరో కొత్త అవతారంలో కనిపించనుంది. ఇప్పటివరకు నటిగా మాత్రమే అలరించిన ఈ బ్యూటీ త్వరలో రచయితగా ప్రూవ్...

బాలీవుడ్ హీరోయిన్గా మారిన సన్నీలియోన్, ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనుంది. ఇప్పటివరకు నటిగా మాత్రమే అలరించిన ఈ బ్యూటీ త్వరలో రచయితగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. అయితే తన రచనల్లో కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటోంది సన్నీ. అందుకే తన ఇమేజ్కు తగ్గట్టుగా శృంగార కథలను అభిమానులకు అందించనుంది.

స్వీట్ డ్రీమ్స్ పేరుతో తన కథలను రిలీజ్కు రెడీ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ కథలను పుస్తకరూపంలోనే కాకుండా డైరెక్ట్గా మొబైల్ ఫోన్స్లో డౌన్ లోడ్ చేసుకునేలా ఢిల్లీలోని ఓ పబ్లిషింగ్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తోంది. తనకు గతంలో రచనలు చేసిన అనుభవం లేకపోయినా తన కథలను పబ్లిష్ చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీకి కృతజ్ఞతలు తెలియజేసింది.

తన కథలు ఎక్కువగా మహిళల కోసం రాస్తున్నానని, మహిళలోని సున్నితత్వంతో పాటు, ఆమె నుంచి మగాడు ఏం కోరుకుంటాడన్న విషయాలను తన కథలలో తెలియజేస్తానంటోంది. ఇప్పటికే ఆన్లైన్ అతి ఎక్కువ సెర్చ్ చేస్తున్న పేరుగా రికార్డులు సృష్టిస్తున్న సన్నీలియోన్, ఈ కథలతో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement