మిడిల్‌ క్లాస్‌ సూర్య | Sundeep Kishan's C/O Surya First Look | Sakshi
Sakshi News home page

మిడిల్‌ క్లాస్‌ సూర్య

Jun 15 2017 12:08 AM | Updated on Sep 15 2019 12:38 PM

మిడిల్‌ క్లాస్‌ సూర్య - Sakshi

మిడిల్‌ క్లాస్‌ సూర్య

సందీప్‌ కిషన్, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’.

సందీప్‌ కిషన్, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’. ‘నా పేరు శివ’ ఫేం సుసీంద్రన్‌ దర్శకత్వంలో ‘స్వామి రారా’ చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ని  హీరో సూర్య విడుదల చేశారు. సహ నిర్మాత రాజేష్‌ దండా మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

 సందీప్‌ కిషన్‌ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా తమిళ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన డి. ఇమ్మాన్‌ను టాలీవుడ్‌కి పరిచయం చే స్తున్నాం. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.లక్ష్మణ్‌ కుమార్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జె.సి, సమర్పణ: శంకర్‌ చిగురుపాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement