అమ్మాయిగా మారిన టాలీవుడ్ నటుడు
గతంలో ఆడ గెటప్ లో కనిపించి ఆలరించిన ప్రముఖుల్లో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కమల్ హసన్, నరేశ్ లున్నారు.
గతంలో ఆడ గెటప్ లో కనిపించి ఆలరించిన ప్రముఖుల్లో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కమల్ హసన్, నరేశ్ లున్నారు. తాజాగా 'ఏమో గుర్రం ఎగురవచ్చు' అనే చిత్రంలో సుమంత్ అమ్మాయి గెటప్ కనిపించి సినీ అభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇటీవలం కాలంలో సరైన విజయం కోసం సుమంత్ ఎదురు చూస్తూన్నారు.
గతంలో గౌరీ, సత్యం, గోదావరి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సుమంత్ తాజాగా తాత అక్కినేని నాగేశ్వరరావును స్పూర్తిగా తీసుకుని ఏమో గుర్రం ఎగురవచ్చు అనే చిత్రంలో ఆమ్మాయి పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో సాంప్రదాయంగా, కట్టు,బోట్టుతో అమ్మాయిగా సుమంత్ ఇచ్చిన నృత్య భంగిమలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకర్సిస్తున్నాయి.
తెనాలి రామకృష్ణ చిత్రంలో అక్కినేని, చంటబ్బాయ్ లో చిరంజీవి, భామనే సత్యభామనే లో కమల్ హసన్, మేడమ్ లో రాజేంద్ర ప్రసాద్, చిత్రం భళారే విచిత్రంలో నరేశ్, గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ లు అమ్మాయిలుగా కనిపించి మెప్పించారు. తాజాగా సుమంత్ చేసే ప్రయత్నం ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచిచూద్దాం!