
హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 ఎప్పుడు ప్రారంభం అవుతుందా బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షోకు సంబంధించి రకరకాల వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ ఏడాది బిగ్‌బాస్ షో ఉంటుందా? లేదా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. అయితే వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్‌బాస్ సీజన్-4 పై స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బిగ్‌బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు బిగ్‌బాస్ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. (బిగ్‌బాస్ సీజన్ 4 తాజా అప్‌డేట్)
బిగ్‌బాస్ సీజన్-4పై స్టార్ మా క్లారిటీ ఇవ్వడంతో.. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు, హోస్ట్ వివరాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ సెట్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. అలాగే కంటెస్టెంట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది.
Here is the most awaited time of the year!!! #BiggBossTelugu4 coming soon on @StarMaa#StaySafeStayStrong #MaaPrayatnamManakosam pic.twitter.com/cQZ1e1kclI
— starmaa (@StarMaa) July 20, 2020