అందరివాడు

Stalin andarivadu movie team press meet - Sakshi

ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతాడు స్టాలిన్‌. చెడుపై అతను ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్టాలిన్‌’. అందరివాడు అనేది ఉపశీర్షిక. ‘రంగం’ ఫేమ్‌ జీవా హీరోగా రియా సుమన్, గాయత్రీకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నవదీప్‌ విలన్‌ పాత్ర చేశారు. రతిన శివ దర్శకుడు. తమిళ నిర్మాణ సంస్థ వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి తెలుగు సంస్థలు నట్టిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ప్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. తమిళంలో ‘సీరు’ పేరుతో రూపొందింది.

రెండు భాషల్లోనూ ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాతలు డాక్టర్‌ ఇషారి కె. గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ– ‘‘రంగం’ తర్వాత ఆ స్థాయిలో ఉండే మాస్‌ సినిమా ఇది. స్టాలిన్‌ పాత్రను జీవా అద్భుతంగా చేశారు. విలన్‌ పాత్రలో నవదీప్‌ ఒదిగిపోయారు. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాం. వచ్చే నెల 2న హైదరాబాద్‌లో ఆడియో ఫంక్షన్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీ సాయి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, గురుచరణ్, సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: ప్రసన్నకుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top