ఎన్టీఆర్, చరణ్‌పై ఫస్ట్‌ షాట్‌ చిత్రీకరణ..! | SS Rajamouli's RRR launched in Hyderabad | Sakshi
Sakshi News home page

స్టార్ట్‌.. కెమెరా

Nov 20 2018 3:14 AM | Updated on Jul 14 2019 4:08 PM

SS Rajamouli's RRR launched in Hyderabad - Sakshi

రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ మూవీ  ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయింది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో కేవలం సౌత్‌ మాత్రమే కాదు నార్త్‌ ఇండియన్‌ ప్రేక్షకులు కూడా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తారనుకోవడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్‌ చే శారు.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన కియారా అద్వానీ, రామ్‌చరణ్‌ సరసన కీర్తీ సురేశ్‌ నటించనున్నారని సమాచారం. హైదరాబాద్‌ నగర శివార్లలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఎన్టీఆర్, చరణ్‌పై ఫస్ట్‌ షాట్‌ చిత్రీకరించారు రాజమౌళి. ‘స్టార్ట్‌ కెమెరా.. సౌండ్‌.. క్లాప్‌.. యాక్షన్‌’ అంటూ రాజమౌళి డైరెక్ట్‌ చేస్తున్న షూటింగ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు చిత్రబృందం. పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. 2020లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement