ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం

Sri Sathya Sai Arts KK Radhamohan owns release rights of Kalki - Sakshi

‘‘కల్కి’ మోషన్‌ పోస్టర్, టీజర్, కమర్షియల్‌ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్, హైప్‌ వచ్చాయి. ఆ క్రేజ్, కంటెంట్‌ చూసి ఈ సినిమాను పంపిణీ చేస్తున్నాం’’ అని నిర్మాత కె.కె. రాధామోహన్‌ అన్నారు. రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల హక్కులను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ సొంతం చేసుకుని, విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. శ్రవణ్‌ భరద్వాజ్‌ బ్రహ్మాండమైన ట్యూన్స్, నేపథ్య సంగీతం అందించారు. మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్లు ఉన్న ఈ సినిమా తప్పకుండా బాగుంటుంది. ఆ నమ్మకంతోనే ‘కల్కి’ని విడుదల చేస్తున్నాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్‌ వేడుకలో సినిమా మెయిన్‌ ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్‌ విల్సన్, రాహుల్‌ రామకృష్ణ, నాజర్, అశుతోష్‌ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top