‘ఎదురీత’ టైటిల్‌కు కచ్చితంగా న్యాయం చేస్తాం | Sravan Raghavendra Edureetha Movie Teaser Launched By Kalyan Ram | Sakshi
Sakshi News home page

'ఎదురీత' టీజర్ విడుదల చేసిన నందమూరి హీరో

Mar 14 2019 8:22 PM | Updated on Mar 14 2019 8:22 PM

Sravan Raghavendra Edureetha Movie Teaser Launched By Kalyan Ram - Sakshi

స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా... 'ఎదురీత' టైటిల్ కు కచ్చితంగా న్యాయం చేస్తాం.

'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'ఎదురీత'. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. బాలమురుగన్ దర్శకుడు. లియోనా లిషోయ్ కథానాయిక. అరల్ కొరెల్లి సంగీత దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను గురువారం హీరో నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ ‘మేం అడగ్గానే మా టీజర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్ గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే... టైటిల్ గురించి మా టీమ్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. 'ఎదురీత' కన్ఫర్మ్ చేశాం. ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ 'టైటిల్ ఏంటి?' అని అడిగారు. 'ఎదురీత' అని చెప్పాను. అప్పుడు ఆయన 'ఎదురీత' సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు.

నందమూరి తారకరామారావు 1977లో నటించిన 'ఎదురీత' గురించి చెప్పారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా... 'ఎదురీత' టైటిల్ కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఇక, సినిమా కథ విషయానికి వస్తే... ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తరవాత ఏం జరిగిందనేదాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్ గా చూపించారు’అంటూ రాఘవేంద్ర పేర్కొన్నారు. సంపత్ రాజ్, జియా శర్మ, శాన్వీ మేఘన, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, 'రంగస్థలం' మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్, భద్రమ్, 'మాస్టర్' చరణ్ రామ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement