ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?! | Sonakshi Sinha trolled for not knowing Ramayana | Sakshi
Sakshi News home page

ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!

Sep 21 2019 9:35 AM | Updated on Sep 21 2019 2:45 PM

Sonakshi Sinha trolled for not knowing Ramayana - Sakshi

ముంబై: దేశంలో రామాయణం, మహాభారతం గురించి తెలియని చాలా తక్కువగా ఉంటారు. హిందు మత ఇతిహాసాలైన ఈ గ్రంథాల గురించి.. సినిమాలు, సీరియళ్లతోపాటు నవలలు ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి. కానీ, రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయారు.

ఇటీవల ఆమె ప్రముఖ క్విజ్‌ రియాలిటీ షో కౌన్‌ బనేగా కరోడపతిలో పాల్గొన్నారు. గత రాత్రి ప్రసారమైన ఈ షోలో ‘హాట్‌ సీట్‌’లో కూర్చున్న సోనాక్షిని హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు? అని అడిగిన అమితాబ్‌..  ఏ. సుగ్రీవుడు, బీ.లక్ష్మణుడు, సీ. సీత, డీ. రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. 

సోనాక్షి మాత్రం ఈ ప్రశ్న సమాధానం చెప్పలేక.. ఒక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకున్నారు. దీంతో ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా? అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నల ఆధారంగా సాగే క్విజ్‌ షో అయిన కౌన్‌ బనేగా కరోడపతి షోకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement