బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు | Social media abuzz after Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు

Apr 29 2017 2:18 PM | Updated on Sep 5 2017 9:59 AM

బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు

బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు

బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?

బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయి భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. రెండో భాగంలోనూ భల్లాలదేవుడి కొడుకు ప్రస్థావన ఉన్నా భార్యను మాత్రం చూపించలేదు. తొలిభాగంలో  కాలకేయల నేపథ్యం వాళ్ల నాయకుడికి వివరాలను సవివరంగా చూపించిన చిత్రయూనిట్ రెండో భాగంలో కుంతల రాజ్యం మీద దాడిచేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

అదే సమయంలో తొలిభాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ రెండో భాగంలో కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. క్లైమాక్స్ మహిష్మతి మీద దండెత్తడానికి శివుడికి సైనికబలం పెద్దగా లేకపోయినా అస్లాం ఖాన్ సాయం మాత్రం తీసుకోలేదు. అంతేకాదు దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అంవతిక నేపథ్యం కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. ఇప్పటికే సినిమా నిడివి పెరిగిపోవటంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేశారో..? లేక అవి అంత ముఖ్యం కాదనుకున్నారోగాని..? సోషల్ మీడియాకు మాత్రం మంచి టాపిక్ ఇచ్చారు బాహుబలి టీం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement