త్రిపాత్రాభినయానికి సిద్ధం | Simbu to don three avatars in his next! | Sakshi
Sakshi News home page

త్రిపాత్రాభినయానికి సిద్ధం

Feb 10 2016 1:53 AM | Updated on Sep 3 2017 5:17 PM

త్రిపాత్రాభినయానికి సిద్ధం

త్రిపాత్రాభినయానికి సిద్ధం

సాధారణంగా హీరోల ద్విపాత్రాభినయమే అరుదు. ఇక త్రిపాత్రాభినయం అన్నది ఇంకా అరుదు. అలాంటిది

 తమిళసినిమా: సాధారణంగా హీరోల ద్విపాత్రాభినయమే అరుదు. ఇక త్రిపాత్రాభినయం అన్నది ఇంకా అరుదు. అలాంటిది ఇప్పుడు త్రిపాత్రాభినయం చేయడానికి నటులు ఆసక్తి చూపుతున్నారు. నటుడు సూర్య 24 చిత్రంలోనూ, ఆయన సోదరుడు కార్తీ కాస్మోరా చిత్రంలోనూ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా తాజాగా నటుడు శింబు కూడా త్రిపాత్రాభినయానికి సిద్ధం అవుతున్నారన్న వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.  ఆ వివరాల్లోకి వెళితే ఇటీవల జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం దర్శకుడిగా పరిచయం అయిన ఆదిక్ నటుడు శింబు కోసం మంచి కథ తయారు చేశారట.
 
  అది శింబుకు బాగా నచ్చేసిందట. ఇందులో ఆయన్ని దర్శకుడు త్రిపాత్రాభినయం చేయించనున్నారట. ప్రస్తుతం శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు మడమయడా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఆదిక్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీని గురించి ఆదిక్ తెలుపుతూ కొద్దికాలం క్రితం తాను శింబును కలిసి కథ చెప్పానన్నారు. కథ ఆయనకు బాగా నచ్చేసిందని చెప్పారు.
 
 ఇది పూర్తి కమర్షియల్ యాక్షన్ ప్యాక్డ్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. అదేస్థాయిలో రొమాన్స్, కామెడీ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. శింబు త్రిపాత్రాభినయం చేసే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటారని అన్నారు. అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ ఉంటారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించినున్నట్లు చెప్పారు.
 
 చిత్రం జూన్‌లో సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. కాగా శింబుతోనే ఈ చిత్రాన్ని ఎందుకు తెరకెక్కించాలనుకుంటున్నారన్న ప్రశ్నకు తాను దర్శకత్వం వహించిన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం విడుదలైన తరువాత తనకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శింబు అని తెలిపారు. అదీకాకుండా తన కథకు కరెక్ట్‌గా నప్పే నటుడు శింబు అని ఆదిక్ బదులిచ్చారు. ఒక భారీ చిత్రం చేయాలనే తన కల ఈ చిత్రం ద్వారా నెరవేరనుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement