సీరియస్‌ లుక్స్‌!

Shraddha Kapoor's First Look From Saaho Goes Viral - Sakshi

ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చుశారుగా! కథానాయిక శ్రద్ధాకపూర్‌ ఎంత సీరియస్‌ లుక్స్‌ ఇస్తున్నారో! ఇంతకీ..ఈ లుక్స్‌ ‘సాహో’ చిత్రంలోనివేనట. ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. గతేడాది అక్టోబర్‌లో ‘సాహో’ చిత్రంలోని ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం అధికారికంగా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అయితే..‘సాహో’లో శ్రద్ధాకపూర్‌ లుక్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో వైరల్‌ అయ్యింది. శ్రద్ధాకపూర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ శ్రద్ధా నాయక్‌ అకౌంట్‌ నుంచి ఈ ఫొటో వైరల్‌ అయ్యిందట. త్వరలోనే ‘సాహో’ టీమ్‌ దుబాయ్‌లో చేజింగ్‌ సీన్స్‌ను  చిత్రీకరించబోతున్నారని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం దుబాయ్‌లో అనుమతి దొరకలేదు. సో.. ఆ చేజింగ్‌ సీన్స్‌ను హైదరాబాద్‌లోనే భారీ బడ్జెట్‌తో సెట్‌వేసి చిత్రీకరిస్తారు అని అభిప్రాయపడుతున్నారు. మరి..ఈ షెడ్యూల్‌ ఎక్కడ జరుగుతుందనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top