చిన్న విరామం | Shivarajkumar to go to London to treat injured shoulder | Sakshi
Sakshi News home page

చిన్న విరామం

Jun 25 2019 6:18 AM | Updated on Jun 25 2019 6:18 AM

Shivarajkumar to go to London to treat injured shoulder - Sakshi

శివరాజ్‌కుమార్‌

స్టార్‌ హీరోలు వరుసగా సినిమాలు చేస్తే అటు అభిమానులకు ఇటు నిర్మాతలకూ ఆనందం. కానీ కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ మాత్రం యాక్టింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇస్తున్నాను అంటున్నారు. భుజానికి తగిలిన గాయం కారణంగా సర్జరీ చేయించుకోవడం కోసం లండన్‌ పయనం అవుతున్నారు. దీంతో ఈ ఏడాది తన బర్త్‌డే (జూలై 12) కూడా సెలబ్రేట్‌ చేసుకోవడం లేదని చెప్పారు. ‘‘చాలా చిన్న సర్జరీ ఇదీ. టెన్షన్‌ పడాల్సింది ఏమీ లేదు. సర్జరీ పూర్తి చేసుకొని తిరిగొచ్చిన తర్వాత నవంబర్‌ వరకూ సినిమాల నుంచి టెంపరరీ బ్రేక్‌ తీసుకుందాం అనుకుంటున్నాను’’ అని శివరాజ్‌కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉంటే... శివరాజ్‌ కుమార్‌ నటించిన ‘రుస్తుమ్‌’ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్‌ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement