సేద్యానికి శ్రీకారం | Sharwanands Sreekaram look release | Sakshi
Sakshi News home page

సేద్యానికి శ్రీకారం

Jan 28 2020 5:47 AM | Updated on Jan 28 2020 5:47 AM

Sharwanands Sreekaram look release - Sakshi

శర్వానంద్‌

గళ్ల లుంగీ కట్టి తువ్వాలు భుజాన వేసి ఉదయాన్నే పొలానికి బయలుదేరి సేద్యానికి శ్రీకారం చుట్టారు శర్వానంద్‌. మరి ఏం పండించబోతున్నారో స్క్రీన్‌ మీద చూసి తెలుసుకోవాలి. నూతన దర్శకుడు కిషోర్‌ బి. దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శర్వానంద్‌ రైతు పాత్రలో నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ముందుగా శర్వానంద్‌ లుక్‌ను విడుదల చేశారు. గ్రామీణ యువకుడిగా లుంగీ గెటప్‌లో శర్వానంద్‌ కొత్తగా కనిపిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement