వర్మ ‘శపథం’ నిజమేనా? | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 23 2018 10:15 AM

Shapadham Title Consider for RGV - Sakshi

సాక్షి, సినిమా : దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాల టైటిల్‌ విషయంలో కూడా కాస్త వైవిధ్యతను ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే సీనియర్‌ హీరో నాగార్జున అక్కినేనితో తెరకెక్కిస్తున్న చిత్రానికి పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ఫిక్స్‌ అయ్యారనే వార్త చక్కర్లు కొడుతోంది. 

ఈ చిత్రానికి శపథం అనే టైటిల్‌ పరిశీలనలో ఉందంట. దానికి సరిగ్గా సరిపోయేలా రివెంజ్‌ కంప్లీట్స్‌ అనే ట్యాగ్‌ లైన్‌ను కూడా పెట్టేశాడన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నిర్మాతలు ఈ చిత్ర టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించారని.. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందని సమాచారం. మరి ఈ వార్తలపై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.  

హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. మైరా సరీన్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. వచ్చే నెల చివరికల్లా చిత్ర షూటింగ్‌ పూర్తి చేసి.. సమ్మర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఆర్జీవీ యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement