షారూఖ్ సినిమాకు మరో హీరో అడ్డు | ShahRukh Khan does not want to clash with Hrithik | Sakshi
Sakshi News home page

షారూఖ్ సినిమాకు అడ్డుపడుతున్న మరో హీరో

Jul 9 2016 11:41 AM | Updated on Sep 4 2017 4:29 AM

షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రాయిస్ రిలీజ్పై డైలామా కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సినిమాను రంజాన్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు...

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రాయిస్ రిలీజ్పై డైలామా కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సినిమాను రంజాన్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో సల్మాన్ సుల్తాన్ రిలీజ్ ఉండటంతో షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రాయిస్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

అయితే ఆ డేట్ కూడా షారూఖ్కు వర్క్ అవుట్ అయ్యేలా లేదు. అదే రోజు అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న బాద్షాహోతో పాటు హృతిక్ లీడ్ రోల్లో రూపొందుతున్న కాబిల్ చిత్రాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అజయ్ దేవగన్తో మాట్లాడిన రాయిస్ నిర్మాతలు పోటీనుంచి బాద్షాహోను తప్పించారు. కానీ కాబిల్ నిర్మాతలు మాత్రం అందుకు అంగీకరించటం లేదు.

ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన రాయిస్ను మరోసారి వాయిదా వేయడానికి షారూఖ్ టీం కూడా సిద్ధంగా లేదు. దీంతో మరోసారి షారూఖ్ స్వయంగా కాబిల్ టీంతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నాడట. సల్మాన్ కోసం డేట్ త్యాగం చేసిన షారూఖ్కి హృతిక్ సాయం చేస్తాడో.. లేదో..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement