కూతురిపై అడిగిన ప్రశ్నకు హీరో షాక్ | Shahid Kapoor will scare of Misha if she wants to be an actress | Sakshi
Sakshi News home page

కూతురిపై అడిగిన ప్రశ్నకు హీరో షాక్

Nov 6 2016 2:29 PM | Updated on Sep 4 2017 7:23 PM

కూతురిపై అడిగిన ప్రశ్నకు హీరో షాక్

కూతురిపై అడిగిన ప్రశ్నకు హీరో షాక్

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కొన్ని రోజుల కిందట తండ్రిగా ప్రమోషన్ పొందాడు.

ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కొన్ని రోజుల కిందట తండ్రిగా ప్రమోషన్ పొందాడు. షాహిద్ కపూర్, మీరా దంపతులు తమ ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా వారి ముద్దుల కూతురుకు మిషా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. మీరా, షాహిద్ పేర్లలోని తొలి అక్షరాలను కలిపి పాపకు మిషా అని పేరు పెట్టారు. కూతురుతో సమయం గడపాలని, చిన్నారితో ఆటలాడాలని కొన్నిరోజులు షూటింగ్స్ నుంచి ఈ హీరో విరామం తీసుకున్నాడు.

కూతురు మిషా గురించి మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు షాహిద్ షాక్ తిన్నాడు. చిన్నారి మిషా ఏదో ఒకనాడు మీ వద్దకు వచ్చి 'నాన్నా నేను నటి అవుతానంటే మీరు ఎలా ఫీలవుతారు' అన్న ప్రశ్నపై షాహిద్ ఇలా స్పందించాడు. అది చాలా కష్టతరమైన పని. నిజంగానే తన కూతురు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మాత్రం చాలా భయపడతానని 'ఉడ్తా పంజాబ్' స్టార్ అన్నాడు. షాహిద్ నెక్ట్స్ మూవీ 'రంగూన్'. ఆ మూవీలో సైఫ్ అలీఖాన్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement