త్వరలో వస్తా

Shahid Kapoor to soon join league of superstars with wax statue - Sakshi

సిల్వర్‌ స్క్రీన్‌ రాణి పద్మావతికి మైనపు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు జరిగిన మూడు గంటల్లోపే మహారాజా  రతన్‌సింగ్‌కు కూడా ఆ గౌరవం దక్కింది. ‘పద్మావత్‌’ సినిమాలోని క్యారెక్టర్ల ప్రకారం రాణి పద్మావతి అంటే దీపికా పదుకోన్‌ అని, రతన్‌సింగ్‌ అంటే షాహిద్‌ కపూర్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోమవారం దీపికా పదుకోన్‌ కొలతలు తీసుకున్నారు మేడమ్‌ తుస్సాడ్స్‌ ప్రతినిధులు. అదే రోజు షాహిద్‌ కొలతలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని షాహిద్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

‘కమింగ్‌ సూన్‌’ అనే క్యాప్షన్‌తో కొలతలు తీసుకుంటున్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. అయితే షాహిద్‌ విగ్రహాన్ని ఢిల్లీ మ్యూజియ్‌లో ఏర్పాటు చేస్తారా? లేక లండన్‌లోనా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీపికా బొమ్మను వచ్చే ఏడాది మొదట్లో లండన్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారని బీ టౌన్‌ టాక్‌. ఇక సినిమాల విషయానికొస్తే... షాహిద్‌ కపూర్‌ హీరోగా శ్రీనారాయణ్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’ చిత్రం సెప్టెంబర్‌ 21న రిలీజ్‌ కానుంది. ఇందులో శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌ కథానాయికలు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top