శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధా | Shraddha Kapoor competes with herself | Sakshi
Sakshi News home page

శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధా

Jun 10 2018 1:23 AM | Updated on Apr 3 2019 6:34 PM

Shraddha Kapoor competes with herself - Sakshi

రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధాకపూర్‌, షాహిద్‌ కపూర్

ఆనందపడాలో లేక బాధపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు శ్రద్ధాకపూర్‌. ఎందుకంటే.. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు, స్త్రీ’ సినిమాలు ఆగస్టు 31నే రిలీజ్‌ కానున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజు సిల్వర్‌స్క్రీన్‌పైకి రాబోతున్నందుకు నవ్వాలో లేక రెండు సినిమాల బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ షేర్‌ అవుతాయని దిగులుపడాలో అర్థం కావడం లేదట శ్రద్ధాకు. పైగా రెండు సినిమాల ప్రమోషన్స్‌లో కంపల్సరీ పాల్గొనాలి. సో.. ప్రమోషన్స్‌లో ఎవరికి ముందు ఓకే అంటే ఎవరు బాధపడతారో అని శ్రద్ధా బాధపడుతున్నారు.

శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బట్టీగుల్‌ మీటర్‌ చాలు’. నిజానికి ఈ సినిమా రిలీజ్‌ డేట్‌నే ముందు అనౌన్స్‌ చేశారు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా జంటగా నటించిన హారర్‌ చిత్రం ‘స్త్రీ’ రిలీజ్‌ డేట్‌ను త్రీ డేస్‌ బ్యాక్‌ ఎనౌన్స్‌ చేశారు. మరి... రిలీజ్‌ డేట్స్‌ విషయంలో మనసు మార్చుకుని ఎవరైనా శ్రద్ధా మనసును సంతోషపెడతారేమో చూడాలి. లేకపోతే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ కోసం శ్రద్ధా వర్సెస్‌ శ్రద్ధానే.

Advertisement
 
Advertisement
Advertisement