పాక్లో దూసుకుపోతున్న 'ఫ్యాన్' | Shah Rukh Khan's 'Fan' Sets New Box Office Record In Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో దూసుకుపోతున్న 'ఫ్యాన్'

Apr 18 2016 1:00 PM | Updated on Sep 3 2017 10:11 PM

పాక్లో దూసుకుపోతున్న 'ఫ్యాన్'

పాక్లో దూసుకుపోతున్న 'ఫ్యాన్'

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్' పాకిస్తాన్ బాక్సీఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.

కరాచీ: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజా చిత్రం 'ఫ్యాన్' పాకిస్తాన్ బాక్సీఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. తొలి మూడు రోజుల్లో 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. పాక్ లో ఈ సినిమా పంపిణీ  హక్కులను జియో ఫిల్మ్స్ తీసుకుంది.

'కరాచీ, లాహోర్లలో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. చాలా సినీప్లెక్సెస్, థియేటర్లలో వారం రోజుల వరకు టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాల విడుదలకు పాకిస్తాన్ పెద్ద మార్కెట్ అని భారతీయ చిత్ర పరిశ్రమ గుర్తిస్తోంది. పాక్లో సినిమాల విడుదలకు ఆసక్తిచూపుతున్నారు' అని జియో ఫిల్మ్స్ ప్రతినిధులు చెప్పారు. షారుక్ ద్విపాత్రిభినయంతో నటించిన ఫ్యాన్ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా దేశ, విదేశాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement